DC vs PBKS | అజేయ శతకంతో రాహుల్ విధ్వంసం.. పంజాబ్ ముందు రికార్డు లక్ష్యం..!
DC vs PBKS : సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్(152 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి శతకంతో గర్జించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులను బౌండరీల వర్షంలో మంచెత్తిన రాహుల్ పంజాబ్ కింగ్స్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు.
DC vs PBKS : సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్(152 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి శతకంతో గర్జించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులను బౌండరీల వర్షంలో మంచెత్తిన రాహుల్ పంజాబ్ కింగ్స్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. పటిష్టమైన పంజాబ్ బౌలింగ్ దళాన్ని తుత్తునియలు చేసిన రాహుల్.. రెండో వికెట్‌కు నితీశ్ రానా(91)తో కలిసి 220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నిగ్స్ ఆఖరి ఓవర్లో బౌండరీ ఢిల్లీ భారీ స్కోరందించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ సొంత గడ్డపై భారీ స్కోర్ కొట్టింది. మూడో ఓవర్లోనే పథుమ్ నిశాంక(11)ను అర్ష్‌దీప్ సింగ్ (1-49) ఔట్ చేసినా కేఎల్ రాహుల్(152 నాటౌట్), నితీశ్ రానా(91)లు క్రీజునంటుకుపోయారు. ఈ సీజన్లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ బౌలర్ల భరతం పట్టిన ఇద్దరూ పోటీపడి బౌండరీలతో విరుచుకుపడగా ఢిల్లీ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది.
Innings Break!
A marathon partnership from KL Rahul and Nitish Rana propel #DC to a mammoth total 🎯👏
Scorecard ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS pic.twitter.com/NfRky0InNy
— IndianPremierLeague (@IPL) April 25, 2026
6, 4, 4 ,4, 6
బార్ట్లెట్ వేసిన 12వ ఓవర్లో రానా రెచ్చిపోయాడు. ఆరు బంతుల్ని 6, 4, 4 ,4, 6గా మలిచి 28 రన్స్ పిండుకోవడంతో పాటు అర్ధ శతకం సాధించాడు. అనంతరం అర్ష్‌దీప్ సింగ్‌ను రాహుల్ ఉతికేస్తూ 6, 4, 4 బాదగా స్కోర్ 190 దాటింది. కాసేపటికే యాన్సెన్ ఓవర్లో స్ట్రెయిట్ బౌండరీతో 47 బంతుల్లోనే రాహుల్ ఐపీఎల్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
When class meets grace 🤝….
….We get to witness a KL Rahul special 😎👏
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @DelhiCapitals | @klrahul pic.twitter.com/2dB0UcyVTn
— IndianPremierLeague (@IPL) April 25, 2026
శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని చాహల్ విడదీసినా.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్నప్పటికీ కాలు రోప్‌కి తగలడంతో టీవీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. సెంచరీకి చేరువైన రానా మరో రన్స్ జోడించి అయ్యర్ సూపర్ క్యాచ్‌కు ఔటయ్యాడు. అనంతరం డేవిడ్ మిల్లర్(3 నాటౌట్) జతగా రాహుల్ ఢిల్లీకి 263 పరుగుల భారీ స్కోరందించాడు. 12, 51 పరుగుల వద్ద జీవనదానం లభించడంతో రెచ్చిపోయిన రాహుల్ పంజాబ్ ఊహించనంత స్కోర్ కట్టబెట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

