DC vs KKR | మెరిసిన రాహుల్, కుల్దీప్.. చివరి పంచ్ ఢిల్లీదే..!
DC vs KKR : చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించి విజయంతో టోర్నీని ముగించింది.
DC vs KKR : చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించి విజయంతో టోర్నీని ముగించింది. రాహుల్(60) అర్ధ శతకంతో భారీ స్కోర్ కొట్టిన ఢిల్లీ.. కుల్దీప్ యాదవ్(3-29), ఎంగిడి(3-27) జోరుతో కోల్‌కతాను కట్టి చేసింది. రహానే(63) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా సహకరించేవాళ్లు కరువయ్యారు. పావెల్() రనౌటవ్వడంతో ఢిల్లీ 40 పరుగుల తేడాతో గెలుపొందింది.
పంతొమ్మిదో సీజన్ లీగ్ దశ ముగిసింది. డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జయభేరి మోగించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ నిరాశగా ఇంటిదారి పట్టింది. డేంజరస్ ఓపెనర్ ఫిన్ అలెన్(20)ను బౌల్డ్ చేసిన ఎంగిడి(3-27) కోల్‌కతాకు షాకిచ్చాడు. కెప్టెన్ అజింక్యా రహానే(63)తో కలిసి దంచేసిన మనీశ్ పాండే(25)ను ఎంగిడి వెనక్కి పంపాడు. సిక్సర్ బాదిన పాండే బౌండరీకి యత్నించి స్టార్క్ డైవింగ్ క్యాచ్‌కు డగౌట్ చేరాడు.
The hat-trick was right there! 🤏🥺
So close yet so far for Kuldeep Yadav 🫣
Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC | @imkuldeep18 pic.twitter.com/pJ9wOsEIb4
— IndianPremierLeague (@IPL) May 24, 2026
అర్ధ శతకం పూర్తి చేసుకున్న రహానే.. పావెల్(29)తో కలిసి గెలుపు బాద్యత తీసుకున్నాడు. కానీ, కుల్దీప్ యాదవ్(3-29) ఒకే ఓవర్లో రహానే, రింకూ సింగ్(0)లను ఔట్ చేసి కోల్‌కతాను కష్టాల్లోకి నెట్టాడు. అనంతరం.. పావెల్ దూకుడుగా ఆడినా రజ్వీ విసిరిన త్రోకు రనౌటవ్వగా ఢిల్లీ విజయం ఖాయమైంది. స్టార్క్() ఓవర్లో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగీలు ఔటయ్యారు. చక్రవర్తిని ఎంగిడి చివరి వికెట్‌గా వెనక్కి పంపగా కోల్‌కతా పరిమితమైంది.
Top of off from long off 😲
That Sameer Rizvi throw had Mitchell Starc’s approval ✅
Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC | @DelhiCapitals pic.twitter.com/wRCC0u077u
— IndianPremierLeague (@IPL) May 24, 2026
రాహుల్ అర్ధ శతకం
ప్లే ఆఫ్స్ బెర్తు చేజారిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఈడెన్ గార్డెన్స్‌లో భారీ స్కోర్ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్ కేఎల్ రాహుల్(60) అర్ధ శతకంతో చెలరేగగా.. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన ఈ ద్వయం వెనుదిరిగినా.. డెత్ ఓవర్లలో మిల్లర్(28), అశుతోష్ శర్మ(18 నాటౌట్)లు దంచేశారు. ఫలితంగా కోల్‌కతాకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

