Rahul Dravid: రోహిత్ శర్మ ఫోన్ కాల్‌ను గుర్తు చేసుకున్న రాహుల్ ద్రావిడ్.. వీడియో
Rahul Dravid: వన్డే వరల్డ్‌కప్‌లో ఓడిన తర్వాత రోహిత్ శర్మ చేసిన ఫోన్ కాల్‌ను రాహుల్ ద్రావిడ్ గుర్తు చేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఫేర్వెల్ ప్రసంగం చేశాడు ద్రావిడ్. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
బ్రిడ్జ్‌టౌన్: టీ20 వరల్డ్‌కప్‌తో రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) కోచింగ్ బాధ్యతలు ముగిసిపోయాయి. నిజానికి వన్డే వరల్డ్‌కప్‌తోనే అతని కాంట్రాక్టు ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓడిన తర్వాత ద్రావిడ్ తన కోచింగ్ బాధ్యతలను వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫోన్ చేయడం వల్లే.. టీ20 వరల్డ్‌కప్ వరకు కోచింగ్ చేపట్టేందుకు అంగీకరించినట్లు రాహుల్ ద్రావిడ్ గుర్తు చేసుకున్నారు. బార్బడోస్‌లో ఫైనల్ గెలిచిన తర్వాత జరిగిన ఫేర్వెల్ స్పీచ్‌లో రాహుల్ ద్రావిడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు చెందిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. చాలా సార్లు అనేక విషయాలపై మాట్లాడుకున్నాం.. కొన్ని సందర్భాల్లో అంగీకరించుకున్నాం.. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించుకున్నామని ద్రావిడ్ తెలిపాడు.
𝗧𝗵𝗲 𝘂𝗻𝗳𝗼𝗿𝗴𝗲𝘁𝘁𝗮𝗯𝗹𝗲 𝗙𝗮𝗿𝗲-𝗪𝗔𝗟𝗟! 🫡
The sacrifices, the commitment, the comeback 🏆
📽️ #TeamIndia Head Coach Rahul Dravid’s emotional dressing room speech in Barbados 👌👌 #T20WorldCup pic.twitter.com/vVUMfTZWbc
— BCCI (@BCCI) July 2, 2024
వరల్డ్‌కప్‌లో కలిసి కట్టుగా ఆడిన భారత క్రికెటర్లపై ద్రావిడ్ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఆటగాళ్లను కోరాడు. ఇలాంటి సందర్భాలను మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటామని, ఇది కేవలం పరుగుల గురించో, వికెట్ల గురించో కాదు అని, మీ కెరీర్‌ను మీరెప్పుడు గుర్తుంచుకోరని, కానీ ఇలాంటి సందర్బాలను ఎంజాయ్ చేయాలని ద్రావిడ్ తెలిపాడు. ప్రతి ఆటగాడు ఏదో ఓ త్యాగం చేసినట్లు మెచ్చుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

