Rahul Dravid: ఐపీఎల్‌కు రీ ఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ ద్రావిడ్
Rahul Dravid : ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రాహుల్ ద్రావిడ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మెంటర్‌గా చేసిన ద్రావిడ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కు ఆ రోల్ ప్లే చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు కోచింగ్ బాధ్యతల నుంచి ఇటీవల తప్పుకున్న రాహుల్ ద్రావిడ్.. ఇప్పుడు ఐపీఎల్లో మెంటర్ పాత్ర పోషించేందుకు రెఢీ అవుతున్నట్లు తెలిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో జత కలిసేందుకు ద్రావిడ్ ఆసక్తిగా ఉన్నట్లు తొలుత వార్తలు వ్యాపించాయి. గంభీర్ స్థానంలో ద్రావిడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు భావించారు. కానీ ఆ జట్టుతో కలిసేందుకు రాహుల్ ద్రావిడ్ ఇంట్రెస్టింగ్గా లేనట్లు తెలుస్తోంది. అయితే ద్రావిడ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తో చర్చల్లో ఉన్నట్లు న్యూస్ అందుతోంది.
నిజానికి టీమిండియా జట్టుకు కోచింగ్ బాధ్యతలు కొనసాగించేందుకు ద్రావిడ్ ఆసక్తిగా లేడు. ఏడాదికి పది నెలలు జట్టుతో గడపాల్సి వస్తున్న కారణంగా అతను హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు నిరాకరించాడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏదైనా ఫ్రాంచైజీతో లింకు కోసం ద్రావిడ్ ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్ అయితే కేవలం రెండు లేదా మూడు నెలలు సరిపోతుందని ద్రావిడ్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఐపీఎల్ జట్లకు మెంటర్‌గా, కోచ్‌గా ద్రావిడ్ చేశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచ్‌గా చేశాడు. 2017లో ఆ ఫ్రాంచైజీని అతను వదిలేశాడు. ఐపీఎల్ కెరీర్ తర్వాత అతను భారత జూనియర్ జట్టు, అండర్-19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా చేశాడు. టీమిండియా జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకు.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా చేశాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

