R Ashwin | తొలి టెస్టులో నా ప్లాన్ అదే.. అందులో సక్సెస్ అయ్యా : అశ్విన్
నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా అని తెలిపాడు. అశ్విన్ 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీశాడు.
R Ashwin : నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో తన ప్లాన్ ఎంటనేది మ్యాచ్ అనంతరం అశ్విన్ చెప్పుకొచ్చాడు. ‘ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మ్యాచ్ మొదలైన్పటి నుంచి నేను ఈ విషయం చెప్తున్నా. ఇలాంటి పిచ్ మీద షార్ట్ లెగ్ లేదా సిల్లీ పాయింట్ దిశగా షాట్లు ఆడాలంటే బ్యాటర్లను ఊరించే బంతులు వేయాలి. నేను అదే చేశాను’ అని అశ్విన్ తెలిపాడు.
5 వికెట్ల ప్రదర్శన
రెండో ఇన్నింగ్స్‌లో అతని దెబ్బకు ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఒకే సెషన్లో అశ్విన్ 5 వికెట్లు తీయడం గమనార్హం. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ 5 వికెట్ల ప్రదర్శన చేయడం 31వ సారి. స్వదేశంలో ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్ తనే. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (32 సార్లు ఐదు వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 132 రన్స్‌తో ఆస్ట్రేలియాను ఓడించింది. రోహిత్ శర్మ సెంచరీతో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. స్పిన్నర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై అశ్విన్, జడేజా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ జడేజా 7 వికెట్లు తీయడమే కాకుండా 70 రన్స్ చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

