BCCI : ఇంగ్లండ్ చేతిలోనూ టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు(Team India) వన్డే సమరానికి సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో పోయిన పరువును వన్డేల్లో విజయంతో దక్కించుకోవాలనే కసితో ఉంది టీమండియా. మరో రెండు రోజుల్లో (జూలై 14 నుంచి) సిరీస్ మొదలవ్వనుండగా ఆదివారం సెలెక్టర్లు స్క్వాడ్‌లో మార్పులు చేశారు. ఇదివరకు ఇంగ్లండ్‌తో వన్డేలకు ప్రకటించిన 15 మంది బృందంలోని హర్షిత్ రాణా, జింబాబ్వేతో పొట్టి సిరీస్‌కు ఎంపిక చేసిన టీ20 స్క్వాడ్‌లోని వరుణ్ చక్రవర్తి స్థానంలో మరొకరిని తీసుకున్నారు.
టీ20 ఛాంపియన్‌గా విదేశీ పర్యటనల్లో కంగుతిన్న భారత జట్టు వన్డేల్లో ప్రతాపం చూపాలనుకుంటోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌కు మరో రెండు రోజులే ఉన్నందున స్క్వాడ్‌ను పటిష్టం చేసుకుంది భారత్. పొట్టిసిరీస్ మధ్యలో గాయపడిన పేసర్ హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలు పర్యటన నుంచి వైదొలగడంతో.. వీరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Ravi Bishnoi is set to replace the injured Varun Chakravarthy in India’s squad for the three T20Is in Zimbabwe later this month
Details: https://t.co/sq4BoXMaRp pic.twitter.com/W0opmyVND2
— Cricinfo (@cricinfo) July 12, 2026
ఐపీఎల్ -19 ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చిన ప్రిన్స్ అఫ్గనిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే.. మూడు మ్యాచుల్లో రెండు వికెట్లే తీసినా పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా రాణించని బిష్ణోయ్‌కు మరో అవకాశం దక్కింది. వన్డే సిరీస్ అనంతరం జింబాబ్వే పర్యటన ఉన్నందున.. ప్రిన్స్, బిష్ణోయ్‌లు టీ20 స్క్వాడ్‌లో కూడా భాగం కానున్నారు.

భారత వన్డే స్క్వాడ్(అప్డేటెడ్): శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.
జింబాబ్వే, టీ20 స్క్వాడ్(అప్డేటెడ్): శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ వర్మ, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.