PR Sreejesh | గోడ వీడ్కోలు.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్
భారత హాకీ జట్టుతో 18 ఏండ్లుగా కొనసాగుతున్న దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పనున్నాడు. గోల్ పోస్ట్ వద్ద ప్రత్యర్థులు యత్నించిన గోల్స్‌ను పెట్టని గోడలా అడ్డుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతడు.. పారిస్ ఒలింపిక్స్ ముగిశాక ఆట నుంచి రిటైర్ కానున్నట్టు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపాడు.
PR Sreejesh | ఢిల్లీ: భారత హాకీ జట్టుతో 18 ఏండ్లుగా కొనసాగుతున్న దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పనున్నాడు. గోల్ పోస్ట్ వద్ద ప్రత్యర్థులు యత్నించిన గోల్స్‌ను పెట్టని గోడలా అడ్డుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతడు.. పారిస్ ఒలింపిక్స్ ముగిశాక ఆట నుంచి రిటైర్ కానున్నట్టు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపాడు. 36 ఏండ్ల ఈ మాజీ సారథి 2006 నుంచి భారత జట్టుతో కొనసాగుతూ ఇప్పటిదాకా 328 మ్యాచ్‌లు ఆడాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌తో నా సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యా. ఈ అద్భుత ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, హాకీ ఇండియాకు కృతజ్ఞతలు. పారిస్‌లో భారత్‌కు పతకం తెచ్చేందుకు మా అత్యుత్తమ ప్రదర్శనను చేస్తాం. పతకం రంగు మార్చడానికి ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్..
2004లోనే భారత జూనియర్ హాకీ జట్టులోకి వచ్చిన శ్రీజేష్.. 2006లో కొలంబో వేదికగా జరిగిన సౌత్ఏషియన్ గేమ్స్ సందర్భంగా సీనియర్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో జట్టులోకి వస్తూ పోతూ సాగిన శ్రీజేష్ ప్రయాణం.. 2011 తర్వాత కొలిక్కివచ్చింది. అప్పట్నుంచి అతడు భారత జట్టులో రెగ్యులర్ గోల్‌కీపర్ అయ్యాడు. టీమ్ఇండియా సాధించిన పలు చారిత్రాత్మక విజయాలలో సభ్యుడిగా ఉన్న శ్రీజేష్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులోనూ సభ్యుడు. 41 ఏండ్ల తర్వాత హాకీలో కాంస్యం నెగ్గిన మ్యాచ్‌లో శ్రీజేష్.. జర్మనీ ఆటగాళ్లు కొట్టిన బంతులకు అడ్డుగోడగా నిలబడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా శ్రీజేష్ రిటైర్మెంట్ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో అతడి కోసం ఆడి పతకం సాధిస్తామని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

