Brisbane Olympics : ఒలింపిక్స్ పోటీలకు ఆతిథ్యమిచ్చే నగరాలు తమ దేశంలోని ప్రముఖ జంతువు లేదా పర్యాటక స్థలాన్ని చిహ్నంగా ఎంచుకోవడం ఆనవాయితీ. లాస్ ఏంజెల్స్ విశ్వక్రీడల్లో ఆ ప్రాంత వైవిధ్యాన్ని LA28 చాటనుంది. ఆ తర్వాతి నాలుగేళ్లకు బ్రిస్బేన్ (Brisbane)లో జరుగనున్న విశ్వక్రీడలకు కూడా చిహ్నాన్ని ప్రకటించారు. ఇంకేముంది కంగారూ (Kangaroo) బొమ్మేగా అనుకుంటే మీరు పొరబడినట్టే. అవును.. అందరూ ఊహించిన ఈ జంతువును వెనక్కినెట్టి మరీ ఓ పక్షి ఎంపికైంది. ఇంతకూ ఆ పక్షి పేరోంటో తెలుసా.. పింక్ కొకాటూ (Pink Cokatoo). ఒలింపిక్స్ చిహ్నంగా ప్రకటితమైన ఈ బర్డ్ విశేషాలు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా 2032 ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ విశ్వ క్రీడల కోసం చిహ్నంగా తమ ప్రాంతంలో విరివిగా కనిపించే కంగారూ జంతువును కాకుండా పింక్ కొకాటూ ఎంపికైంది. క్వీన్స్‌లాండ్‌లో ఒలింపిక్, పారాలింపిక్ స్టార్లు ఇయాన్ థోర్ప్ గ్రాంట్ ప్యాటర్సన్ అన్నా మేర్స్, అలెక్సా లీరీలు.. చిన్న చిన్న భాగాలుగా ఈ పక్షి రూపాన్ని ఆవిష్కరించారు నిర్వాహకులు. బ్రిస్బేన్‌లో నిర్వహించిన ఓ పజిల్ వేడుకలో దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇలా ముక్కలుగా రూపొందించారు.

ఇంతలా ఏరికోరి మరి ఈ పక్షిని తీసుకోవడానికి ఓ కారణముంది. ఇది ఓ ఆస్ట్రేలియా పక్షి. లేత గులాబీ రంగులో ఉండే ఈ పక్షి తలపై కిరీటంను పోలిన ఈకలతో పింక్ కొకాటూ చాలా చూడముచ్చటగా ఉంటోంది. ‘బ్రిస్బేన్ 2032 విశ్వక్రీడల చిహ్నంగా పింక్ కొకాటూను స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆస్ట్రేలియాలోని జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ పక్షి తలపై ప్రకాశవంతమైన ఎరుపు, మధ్యలో పసుపు, ఆఖర్లో తెలుపు రంగులో ఉండే పొడవైన ఈకలు కిరీటంలా ఉంటాయి. అందుకని ఇది ఒలింపిక్, పారాలింపిక్ ఫ్లేమ్‌ను ప్రతిబించించనుంది. క్వీన్స్లాండ్ ఆకారం.. బ్రిస్బేన్ ఆకృతిలో కన్ను కలిగిన ఈ పక్షి బ్రిస్బేన్, ఆస్ట్రేలియా ఐక్యతకు చిహ్నం’ అని ఆసీస్ వర్గాలు వెల్లడించాయి.
We are celebrating our new family member 🤗.
Welcoming the newly launched Brisbane 2032 Olympic emblem with a walk down memory lane. 🫶
#Olympics #Brisbane2032 https://t.co/vnOcjBYg2S
— The Olympic Games™ (@Olympics) October 5, 2026
మరీ పెద్దగా, మరీ చిన్నదిగా కాకుండా మీడియం సైజులో ఉండే దీన్ని మొదట్లో మేజర్ మిచెల్స్ కొకాటూ, లీడ్బీటర్స్ కొకాటూ అనే పేర్లతో పిలిచేవాళ్లు. ఈశాన్య ఆస్ట్రేలియాలో విరివిగా కనిపిస్తుందీ పక్షి. ఆడమగ.. దాదాపు రెండూ ఒకేలా ఉంటాయి. అయితే.. మగ పక్షి కాసింత పెద్దగా ఉంటుంది. అంతేకాదు ఎదిగిన మగ పక్షి ముదురు రంగులో, ఆడ పక్షి తలపై రెడ్డిష్ ఈకలతో కనిపిస్తుంది. అలానే వీటి జీవితకాలం 40 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉంటుందని సమాచారం.బ్రిస్బేన్‌లో 2032 జులై 23వ తేదీ శుక్రవారం నుంచి ఆగస్టు 8 ఆదివారం వరకు ఒలింపిక్స్.. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పారాలింపిక్స్ పోటీలు జరుగనున్నాయి.