ప్రేక్షకుల్లేకుండా ఒలింపిక్స్!

టోక్యో: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ క్రీడా పండుగ టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్లో కొత్త కేసులు పెరుగుతుండడంతో జూలై 23 నుంచి జరుగాల్సిన విశ్వక్రీడలు ఖాళీ స్టేడియాల్లో సాగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించబోమని ప్రకటించిన నిర్వాహకులు జపనీయుల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్రేక్షకులు లేని ఒలింపిక్స్ కోసం సిద్ధపడాలని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) అధ్యక్షుడు సెబాస్టియన్ కోయ్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జరుపకూడదని దాదాపు రెండున్నర లక్షల మంది జపాన్వాసులు ఆన్లైన్ పిటిషన్ను సమర్థించగా.. విశ్వక్రీడలను సురక్షితంగా నిర్వహిస్తామని ఆ దేశ ప్రధాని యోషిహిండే సుగా స్పష్టం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

