ODI World Cup | మరో అప్సెట్ లోడింగ్? సఫారీలకు నెదర్లాండ్స్ షాకిచ్చేనా!
ODI World Cup | ఇటీవలే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ ఇచ్చిన స్ఫూర్తితో నెదర్లాండ్స్ జట్టు సఫారీలకూ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ODI World Cup | ఇటీవలే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ ఇచ్చిన స్ఫూర్తితో నెదర్లాండ్స్ జట్టు సఫారీలకూ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా జట్టు.. 20 ఓవర్ల లోనే 5 కీలక వికెట్లను కోల్పోయింది. మరో రెండు వికెట్లు పడితే వన్డే వరల్డ్ కప్ లో రెండో అప్సెట్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 21 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.
246 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు టెంబా బవుమా (15), క్వింటన్ డికాక్ (20) లు తొలి వికెట్‌కు 7.6 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. కానీ అకర్మన్ ఎనిమిదో ఓవర్లో సఫారీలకు తొలి షాకిచ్చాడు. ఆ ఓవర్లో ఆఖరుబంతికి డికాక్.. వికెట్ కీపర్ ఎడ్వర్డ్స్‌కు క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు. అనంతరం స్పిన్నర్ వాన్ డెర్ మెర్వ్.. తాను వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికే బవుమాను బౌల్డ్ చేశాడు.
ఎయిడెన్ మార్క్రమ్ (1) కూడా ఓపెనర్ల బాటే పట్టాడు. మార్క్రమ్ను వాన్ మీకెరెన్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. బవుమా వికెట్ తీసిన ఊపులోనే వాన్ డెర్ మెర్వ్.. 11.2 వ ఓవర్లో రెండో బంతికి రస్సీ వాన్ డెర్ డసెన్ (4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 7.5 ఓవర్లలో 36-0 గా ఉన్న సఫారీ స్కోరు బోర్డు.. నాలుగు ఓవర్ల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 44-4 కు చేరింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 28, 4 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (20 బ్యాటింగ్) లు మరో వికెట్ పడకుండా నెదర్లాండ్ బౌలర్లను అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే ధాటిగా ఆడుతున్న క్లాసెన్‌ను వాన్ బీక్.. ఔట్ చేయడంతో సఫారీలు ఐదు వికెట్ కోల్పోయారు. ప్రస్తుతం మిల్లర్‌తో పాటు మార్కో జాన్సేన్ మాత్రమే బ్యాటింగ్ చేయగలడు. ఇదే ఊపులో నెదర్లాండ్స్ జట్టు మరో రెండు వికెట్లు పడగొడితే కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

