అబుధాబి: ఆఫ్ఘనిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన బంతిని స్ట్రైట్‌గా ఆడేందుకు ప్రయత్నించిన ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (14).. సౌథీకే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 115 పరుగుల వద్ద అతను పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన జద్రాన్ (73) ఆ మరుసటి బంతికే లాంగాఫ్‌లో నీషమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
నిలకడగా ఆడుతున్న జద్రాన్, నబీ అవుటవడంతో ఆఫ్ఘన్ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. ఆ కాసేపటికే 19వ ఓవర్లో ఇష్ సోధి బౌలింగ్‌లో కరీమ్ జనత్ (2) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 122/7 స్కోరుతో నిలిచింది.