అబుధాబి: స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్మెన్ రాణిస్తున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) ఆ జట్టుకు శుభారంభం అందించారు. నాలుగో ఓవర్లో మిచెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (29 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నాడు.
అతనితో పాటు ప్రస్తుతం డెవాన్ కాన్వే (26 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ రాణిస్తుండటంతో 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది.