NZ vs ENG | స్టోక్స్ వీడ్కోలు టెస్టులో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ న్యూజిలాండ్ కైవసం..!
NZ vs ENG : స్వదేశంలో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఓవల్ టెస్టులో విజయంతో సిరీస్ సమం చేసిన కివీస్ నాటింగ్హమ్ టెస్టులో 160 పరుగులతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
NZ vs ENG : స్వదేశంలో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఓవల్ టెస్టులో విజయంతో సిరీస్ సమం చేసిన కివీస్ నాటింగ్హమ్ టెస్టులో 160 పరుగులతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఛేదనలో తడబడిన ఆతిథ్య జట్టు.. ఫౌల్క్స్(3-52) ధాటికి కుప్పకూలింది. జేమీ స్మిత్(60)అర్ధ శతకంతో పోరాడినా గట్టెక్కించలేకపోయాడు. ఫలితంగా టెస్టు సిరీస్‌లో వెనకబడిన న్యూజిలాండ్..2-1తో విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెన్ స్టోక్స్‌ను ఈ పరాజయం మరింత బాధించనుంది.
సిరీస్ విజేతను నిర్ణయించే నాటింగ్హమ్ టెస్టులో తొలి రోజే ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్‌ను మట్టకరిపించింది. రెండో ఇన్నింగ్స్‌ను 288-9 వద్ద డిక్లేర్ చేసిన కివీస్.. ఐదోరోజు ప్రత్యర్థిని పడగొట్టింది. జకారీ ఫౌల్క్స్(3-52) విజృంభణతో టాపార్డర్ విఫలమవ్వగా.. జేమీ స్మిత్(60), గస్ అట్కిన్సన్(19)లు ప్రతిఘటించారు. లంచ్‌కు వెళ్లిన ఇంగ్లండ్.. కాసేపటికే మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో, చివరి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు విజయంతో వీడ్కోలు పలకాలనుకున్న ఆతిథ్య జట్టు ఆశలు ఆవిరయ్యాయి.
A superb win from New Zealand at Nottingham to seal the series, as Ben Stokes’ international career ends in defeat
Scorecard: https://t.co/ShTHEDp9T6 pic.twitter.com/KDhuyjvKma
— Cricinfo (@cricinfo) June 29, 2026
డకెట్ శతకంతో..
తొలి ఇన్నింగ్స్‌లో ధీటుగా బదులిచ్చింది ఇంగ్లండ్. ఓపెనర్ బెన్ డకెట్(113) శతకంతో భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. మరో ఎండ్‌లో కుర్రాడు జాకబ్ బెథెల్(74) అర్ధ శతకంతో భయపెట్టాడు. కానీ, న్యూజిలాండ్ పేసర్లు మూడో రోజు ఆరంభంలోనే రెచ్చిపోయారు. నాథన్ స్మిత్(4-91), జకారీ ఫౌల్క్స్(3-35), విలియం ఓ రూర్కీ(3-53)లు వికెట్ల వేటతో స్టోక్స్ సేనను పడగొట్టారు.
బెన్ డకెట్(113), జాకబ్ బెథెల్(74)

విలియం ఓ రూర్కీ(3-53) ధాటికి తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 354కే ఆలౌటైంది. కివీస్‌కు 84 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తొలుత టామ్ లాథమ్(151), డెవాన్ కాన్వే(157)ల శతకాలో న్యూజిలాండ్ 438 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

