వింబుల్డన్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 3 జకోవిక్ విజయం సాధించాడు. ప్రపంచ నెంబర్ 40 నిక్ కిర్గియోస్తో పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం పోరాడిన జకోవిక్.. ఈ విజయంతో వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మూడు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్లో జకోవిక్ 4-6, 6-3, 6-4, 7-6 (7-3) పాయింట్లతో కిర్గియోస్ను మట్టికరిపించాడు. దీంతో జకో ఖాతాలో మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ చేరాయి.