FIFA World Cup 2026 | ఇరాక్‌పై నార్వే ఘన విజయం.. ‘వైకింగ్’ షోతో దద్దరిల్లిన స్టేడియం.. వీడియో
Viking Row | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-I లీగ్ మ్యాచ్‌లో నార్వే జట్టు ఘన విజయంతో బోణీ కొట్టింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల జిల్లెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో నార్వే 4-1 తేడాతో ఇరాక్‌పై విజయం సాధించింది.
Viking Row | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-I లీగ్ మ్యాచ్‌లో నార్వే జట్టు ఘన విజయంతో బోణీ కొట్టింది. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల జిల్లెట్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో నార్వే 4-1 తేడాతో ఇరాక్‌పై విజయం సాధించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన నార్వే జట్టుకు మద్దతుగా తరలివచ్చిన అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు. నార్వే ఫ్యాన్స్ తమ సాంప్రదాయ “వైకింగ్ రో” ప్రదర్శనతో గ్యాలరీల్లో సందడి చేశారు. వేలాది మంది అభిమానులు ఏకతాళంతో చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ వైకింగ్ శబ్దాలు చేయడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ వినూత్న విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరోవైపు మ్యాచ్‌లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ తన వరల్డ్ కప్ అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. 29వ నిమిషంలో మొదటి గోల్ చేసిన హాలాండ్, 43వ నిమిషంలో మరో అద్భుత గోల్‌తో జట్టుకు స్పష్టమైన ఆధిక్యాన్ని అందించాడు. ఇరాక్ తరపున 39వ నిమిషంలో స్టార్ ప్లేయర్ ఐమెన్ హుస్సేన్ పవర్ఫుల్ హెడర్‌తో గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే రెండో అర్ధభాగంలో నార్వే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 76వ నిమిషంలో లియో ఒస్టిగార్డ్ గోల్ చేయగా, మ్యాచ్ ముగిసే సమయానికి ఇరాక్ ప్లేయర్ చేసిన ఓన్ గోల్‌తో నార్వే స్కోరు 4-1కు చేరింది. ఈ విజయంతో నార్వే గ్రూప్-Iలో శుభారంభం చేసింది. హాలాండ్ ప్రదర్శన, ఫ్యాన్స్ వైకింగ్ రో హైలైట్‌గా నిలిచాయి.
‘వైకింగ్’ షో
‘వైకింగ్’ షో లేదా వైకింగ్ రో అంటే.. చేతులు పైకెత్తి ఏకతాళంతో చప్పట్లు కొడుతూ, ‘హు!’ అని గర్జించే అభిమానుల విన్యాసం. ఆటగాళ్లలో యుద్ధ స్ఫూర్తిని నింపే అద్భుత ప్రదర్శన. ఇది సాధారణంగా నార్వే, ఐస్లాండ్ వంటి నార్డిక్ (Nordic) దేశాల ఫుట్‌బాల్ అభిమానులు తమ జట్టును ఉత్సాహపరచడానికి స్టేడియంలో ఈ విన్యాసం చేస్తారు.
Norway fans are bringing Viking energy to the World Cup.
The Norwegian men’s national football team is returning to the tournament for the first time in 28 years, and supporters have been celebrating with a “rowing” chant performed in unison #worldcup #norway pic.twitter.com/QBk8DprO6a
— Marian Clark (@MarianC76435900) June 16, 2026
🇳🇴 Norway fans completely taking over the stadium against Iraq! 🥁🚣 pic.twitter.com/3Wyr6t3cU7
— Ultras Clips (@ultras_clips) June 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

