Nicholas Pooran | అంతర్జాతీయ క్రికెట్‌కు విండీస్ విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ గుడ్‌బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) విధ్వంసక బ్యాటర్ మూడు ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. 29 ఏండ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు.
Nicholas Pooran | అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) విధ్వంసక బ్యాటర్ మూడు ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. 29 ఏండ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు. విండీస్ వికెట్ కీపర్-బ్యాటర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే ఫ్రాంచైజ్ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని వెల్లడించారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే పూరన్ అంటర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం విశేషం. ఈమేరకు పూరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని, అయినప్పటికీ చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా అని రాసుకొచ్చాడు.
‘చాలా ఆలోచించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. తాము ఎంతో ఇష్టపడే ఈ ఆట చాలా ఇచ్చింది. ఇస్తూనే ఉంటుంది. వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యంవహించే అవకాశం ఎంతో ఆనందాన్ని, మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. ఆ మెరూన్ రంగు ధరించడం, జాతీయగీతం కోసం నిలబడటం, మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడం. నిజంగా మాటల్లో చెప్పడం కష్టం. కెప్టెన్‌గా జట్టును నడిపించడం నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకునే గౌరవం’ అని రాసుకొచ్చారు. నాపై చూపిన అమితమైన ప్రేమకు ధన్యవాదాలు, కష్ట సమయాల్లో నావెంటే ఉన్నారంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రయాణంలో నాతో కలిసినందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకం, మద్దతు తనను ముందుకు నడిపించాయని చెప్పారు.

విండీస్ తరఫున 61 వన్డేలు ఆడిన ఈ లెఫ్ట్ హాండ్ బ్యాటర్ 1983 రన్స్ చేశాడు. వాటిలో 3 సెంచరీలు ఉన్నాయి. 106 టీ20ల్లో 2275 పరుగులు చేశాడు. ఇటీవల ఐపీఎల్ 2025 సీజన్లో తన పవర్ ఏంటో చూపించారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 14 మ్యాచ్‌ల్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 524 పరుగులు సాధించాడు. విడీస్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పూరన్.. మరో 8 నెలల్లో పొట్టి ప్రపంచకప్ ఉండగా తప్పుకోవడం గట్టి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

