FIFA World Cup | బ్రెజిల్‌కు ఎదురుదెబ్బ.. మోకాలి గాయంతో గ్రూప్ మ్యాచ్‌లకు నెయ్మర్ దూరం
నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని సమాచారం
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న బ్రెజిల్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు నెయ్మర్ గ్రూప్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. సెర్బియాతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో అతనికి మోకాలికి గాయం అయింది. మోకాలి గాయం నుంచి కోలుకునేందుకు నెయ్మర్కు విశ్రాంతి అవసరమని, అందువల్ల అతను గ్రూప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జట్టు వైద్యులు ప్రకటించారు.
తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో సెర్బియా మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెర్బియా ఆటగాడు నికోల మిలెన్కోవిక్ను ఢీ కొట్టడంతో నెయ్మర్ మోకాలికి గాయమైంది. అయినా కూడా తమ జట్టు రెండు గోల్స్ చేసేంత వరకు మైదానంలోనే ఉన్నాడు. ఆట 10 నిమిషాల్లో ముగుస్తంది అనగా అతను మైదానం వీడాడు. గాయం నుంచి కోలుకునేందుకు నెయ్మర్కు విశ్రాంతి ఇవ్వనున్నారు. అయితే డిసెంబర్ 3వ తేదీ నుంచి జరిగే నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌లకు ఈ స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉంటాడని సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

