Martin Guptill | అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్
Martin Guptill | న్యూజిలాండ్ దిగ్గజ ఆగటాడు మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్.. 14 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2
Martin Guptill | న్యూజిలాండ్ దిగ్గజ ఆగటాడు మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్.. 14 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 అక్టోబర్‌లో గప్టిల్ చివరిసారిగా న్యూజిలాండ్ తరఫున ఆడాడు. గప్టిల్ న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్ల్లో కలిపి మొత్తం 367 మ్యాచ్‌లు ఆడాడు. కెరియర్లో 23 సెంచరీలు సాధించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ తన సత్తాచాటుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గప్టిల్. 122 మ్యాచుల్లో 3561 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 7,346 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. గప్టిల్ కంటే ముందు రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు. అరంగేట్రం చేసిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. 2009లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని నమోదు చేశాడు.
2015 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండిస్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అతని కెరియర్లోనే ఇది అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. ప్రపంచ కప్‌లో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులు సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో వెస్టిండిస్‌పై 136 బంతుల్లో 237 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 24 ఫోర్లు, 11 సిక్సర్లతో వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గప్టిల్ 2013లో ఇంగ్లండ్‌పై అజేయంగా 189 పరుగులు.. 2017లో దక్షిణాఫ్రికాపై 180 పరుగులు చేశాడు. గప్టిల్ టీ20లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. 2012లో దక్షిణాఫ్రికాపై 69 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేయగా.. 2018లో ఆస్ట్రేలియాపై 54 బంతుల్లో 105 రన్స్ బాదాడు. గప్టిల్ టెస్టుల్లోనూ ఆకట్టుకున్నాడు. 47 మ్యాచ్‌ల్లో 2,586 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో మూడు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 189 పరుగులు. 2010లో బంగ్లాదేశ్‌పై అజేయ సెంచరీ చేశాడు. 2011లోనూ జింబాబ్వేపై 109 పరుగులు చేయగా.. 2015లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 156 పరుగులు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

