25 ఏళ్ల కిందటి గంగూలీ రికార్డును బద్దలుకొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్

లండన్: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట 25 ఏళ్లుగా ఉన్న ఓ అరుదైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డెవోన్ కాన్వే ఈ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రం చేయడమే కాకుండా సెంచరీ బాదిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కాన్వే నిలిచాడు. ఈ క్రమంలో గంగూలీ రికార్డును అధిగమించాడు. గంగూలీ 1996లో ఇదే లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రం చేసి 131 పరుగులు చేశాడు.
లార్డ్స్‌లో టెస్ట్ అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డును గంగూలీ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా కాన్వే మాత్రం ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ తొలి రోజే 136 పరుగులతో నాటౌట్‌గా నిలిచి గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. మరో విశేషం ఏమిటంటే గంగూలీ, కాన్వే ఇద్దరూ జులై 8నే తమ పుట్టినరోజు జరుపుకుంటారు. అంతేకాదు లార్డ్స్‌లో అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసిన మూడో విదేశీ బ్యాట్స్‌మన్ కాన్వే. గతంలో గంగూలీతోపాటు 1893లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హ్యారీ గ్రాహం కూడా 107 పరుగులు చేశాడు. బుధవారం కాన్వే సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లకు 246 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

