ODI WC 2023 | వరల్డ్ కప్ ముందే భారత్‌కు నెదర్లాండ్స్ జట్టు.. ఎందుకో తెలుసా..?
ODI WC 2023 : ఈసారి వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifier 2023)లో నెదర్లాండ్స్ (Netherlands) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) సారథ్యంలోని డచ్ బృందం వెస్టిండీస్ వంటి పెద్ద జట్లకు షాకిచ్చి అనూహ్యంగా మెగా టోర్నీకి అర్హత సాధించింది. అయితే.. వరల్డ్ కప్ ముందే ఆ జట్టు భారత గడ్డపై కాలుమోపనుంది. అవును.. ప్రీ- వరల్డ్ కప్ క్యాంప్....
ODI WC 2023 : ఈసారి వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifier 2023)లో నెదర్లాండ్స్ (Netherlands) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్కాట్ ఎడ్వర్డ్స్(Scott Edwards) సారథ్యంలోని డచ్ బృందం వెస్టిండీస్ వంటి పెద్ద జట్లకు షాకిచ్చి అనూహ్యంగా మెగా టోర్నీకి అర్హత సాధించింది. అయితే.. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..? వరల్డ్ కప్ ముందే ఆ జట్టు భారత గడ్డపై కాలుమోపనుంది. అవును.. ప్రీ- వరల్డ్ కప్ క్యాంప్(Pre-World Cup Camp)లో భాగంగా నెదర్లాండ్స్ టీమ్ ఇండియాలో కొన్ని మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ క్యాంప్‌ను కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(Karnataka State Cricket Association), నెదర్లాండ్స్ క్రికెట్(Netherlands Cricket) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే కర్నాటక క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. నెదర్లాండ్స్ ప్రీ – వరల్డ్ కప్ క్యాంప్ సెప్టెంబర్ 19న మొదలై అక్టోబర్ 1న ముగుస్తుంది. బెంగళూరులోని అలుర్ స్టేడియం(Alur Stadium)లో జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.
డచ్ జట్టు వరల్డ్ కప్ షెడ్యూల్
వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జట్టు పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇదే గ్రౌండ్లో అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ ఢీ కొంటాయి. 17వ తేదీన ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 21న శ్రీలంకతో లక్నోలో, 25న ఆస్ట్రేలియాతో ఢిల్లీలో నెదర్లాండ్స్ తలపడుతుంది. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ అక్టోబర్ 28న కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్లో ఎదురుపడుతాయి. నవంబర్ 3న అఫ్గనిస్థాన్‌తో, 8వ తేదీన ఇంగ్లండ్‌తో డచ్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. నెదర్లాండ్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నవంబర్ 11న భారత్‌ను ఢీ కొట్టనుంది.
నెదర్లాండ్స్ జట్టు

ఈ మధ్యే జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో నెదర్లాండ్స్ సంచలన ప్రదర్శన చేసింది. బలమైన వెస్టిండీస్, శ్రీలంకతో పాటు స్కాట్లాండ్ జట్లను చిత్తు చేసింది. దాంతో, అత్యధిక రన్ రేటుతో వరల్డ్ కప్ ఆఖరి బెర్తు దక్కించుకుంది. అక్టోబర్ 5న భారత గడ్డపై ప్రపంచ కప్ పోటీలు మొదలవ్వనున్నాయి. 2019 ఫైనలిస్ట్‌లు న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఆరంభ పోరులో ఢీ కొననున్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ఈ సారి చాంపియన్ ఎవరో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి
Stuart Broad | న్యూజిలాండ్‌పై నిప్పులు చెరిగి.. భారత్ భరతం పట్టిన బ్రాడ్ కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే 10 అద్భుత ప్రదర్శనలివే!
Fawad Alam | ఫ్రాంచైజీకి ఆడేందుకు.. పాకిస్థాన్ జట్టుతో తెగతెంపులు చేసుకున్న స్టార్ బ్యాటర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

