ODI WC Qualifiers 2023 | ఆఖరి బెర్త్ నెదర్లాండ్స్‌దే.. వరల్డ్ కప్ బరిలోని పది జట్లు ఇవే..!
ODI WC Qualifiers 2023 : నెదర్లాండ్స్ జట్టు(Netherlands) వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్(Scotland)పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఆఖరి బెర్త్ దక్కించుకుంది. 2011 తర్వాత ఆ జట్టు మళ్లీ వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై కావడం ఇదే మొదటిసారి. హోరాహోరీ జరిగిన మ్యాచ్‌లో బాస్ డీ లీడె(123) విధ్వసంక శతకం బాదడంతో నెదర్లాండ్స్ మరో...
ODI WC Qualifiers 2023 : నెదర్లాండ్స్ జట్టు(Netherlands) వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్(Scotland)పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఆఖరి బెర్త్ దక్కించుకుంది. 2011 తర్వాత ఆ జట్టు మళ్లీ వరల్డ్ కప్ టోర్నీకి క్వాలిఫై కావడం ఇదే మొదటిసారి. హోరాహోరీ జరిగిన మ్యాచ్‌లో బాస్ డీ లీడె(123) విధ్వసంక శతకం బాదడంతో నెదర్లాండ్స్ మరో 7 ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కీలక పోరులో జట్టుకు విజయాన్ని అందించిన లీడె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ ఫైనల్లో నెదర్లాండ్స్, శ్రీలంకతో ఆదివారం(జూలై 9న) తలపడనుంది.
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్(Queens Sports Club)లో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో మొదట స్కాట్లాండ్ 277 రన్స్ కొట్టింది. బ్రండన్ మెక్‌ముల్లెన్(106) సెంచరీ, కెప్టెన్ బెర్రింగ్టన్(64) హాఫ్ సెంచరీతో మెరిశారు. భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డీ లీడె(123) విధ్వసంక శతకం సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(25), సకీబ్ జుల్ఫికర్(33) అద్భుతంగా పోరాడి జట్టును గెలిపించారు.
సెంచరీ కొట్టిన బాస్ డీ లీడె (123)

🟠WOW!!!! WOW!!!!! WOW!!!!! WOW!!!! WOW!!!!
What an incredible achievement!#ICC #CWC23 #haveaniceday #cricketinnl #kncbcricket pic.twitter.com/zIKpomgXRy— Cricket🏏Netherlands (@KNCBcricket) July 6, 2023
ముందు 8.. తర్వాత 2
ఈ ఏడాది వరల్డ్ కప్‌లో పోటీలకు 8 జట్లు ముందుగానే అర్హత సాధించాయి. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక, నెదర్లాండ్స్ ఆఖరి రెండు బెర్తులు దక్కించుకున్నాయి. మాజీ చాంపియన్ వెస్టిండీస్, లీగ్ దశలో ఆకట్టుకున్న జింబాబ్వే జట్లు అనూహ్యంగా వెనకబడ్డాయి. ఈ మెగా టోర్నీలో తలపడనున్న పది జట్లు ఏవంటే..? భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్.
ఇవి కూడా చదవండి
Tilak Verma | కలిసొచ్చిన చేతి వాటం.. తిలక్ వర్మ మరో యువరాజ్ అయ్యేనా..?
Team India | విండీస్ గడ్డపై ప్రాక్టీస్ షురూ.. ఆఫ్‌స్టంప్‌పై దృష్టి పెట్టిన కోహ్లీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

