Neeraj Chopra: రెజ్లర్ల ధర్నా కలిచి వేస్తోంది: నీరజ్ చోప్రా
Neeraj Chopra: న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ తన ట్వీట్లో తెలిపారు. దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే అని నీరజ్ అన్నారు.
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అయితే రెండోసారి ధర్నా చేపట్టడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఈ ఘటనపై స్పందించారు. రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని నీరజ్ కోరారు.
న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ తన ట్వీట్లో తెలిపారు. దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే అని, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇక ఎప్పుడూ జరగకూడదని, ఇది చాలా సున్నితమైన అంశమని, చాలా పారదర్శకంగా ఈ సమస్యను పరిష్కరించాలని నీరజ్ తన ట్వీట్లో కోరారు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 28, 2023
అథ్లెట్లకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మేటి రెజ్లర్లు వినోశ్ పోగట్, సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు అనేక మంది టాప్ రెజ్లర్లు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అథ్లెట్లకు మద్దతుగా ఒలింపిక్ మెడలిస్టు అభినవ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

