టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సెమీఫైనల్స్‌లో విజయం సాధించాడీ స్టార్ ప్లేయర్. డెనిస్ షాపొవలోవ్తో జరిగిన క్వార్టర్స్‌లో గెలిచాడు. దీంతో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్స్ చేరాడు.
ఈ క్రమంలోనే అరుదైన రికార్డు సాధించాడు నాదల్. వరుసగా 16 సీజన్ల పాటు కనీసం ఒక గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ చేరుతూ వచ్చిన క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అగాసీ పేరిట ఉండేది. అతను 15 సీజన్ల పాటు కనీసం ఒక గ్రాండ్ స్లామ్ సెమీస్ చేరుతూ వచ్చాడు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో మరో స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఉన్నాడు. అతను 18 సీజన్ల పాటు కనీసం ఒక గ్రాండ్ స్లామ్ సెమీస్ చేరుతూ వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత క్రీడాకారిణి సానియా జోడీ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.