ముంబై: ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌కు ముంబై ఇండియన్స్ అవకాశం కల్పించింది. తదుపరి ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌ల కోసం ఆకాశ్‌ను జట్టులోకి తీసుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలుగడంతో అతడి స్థానంలో ఆకాశ్‌ను నియమించుకుంది.
28 ఏండ్ల మీడియం పేసర్ ఆకాశ్ 15 టీ20 మ్యాచ్‌లాడి 15 వికెట్లు పడగొట్టాడు. వాస్తవ ధర రూ.20 లక్షలకే ఆకాశ్ ముంబైతో జత చేరాడు.