Lionel Messi | మెస్సీ మేనియా.. మియామి క్లబ్ ఇన్‌స్టాగ్రామ్‌కు పోటెత్తిన అభిమానులు
Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. అతడికి సోషల్‌మీడియాలోనూ మస్త్ మంది ఫాలోవర్లు ఉన్నారు. మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ(PSG) క్లబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా మెస్సీ 'నేను మళ్లీ బార్సిలోనా(Barcelona)కు వెళ్లడం లేదు. అమెరికా క్లబ్‌కు వెళ్తున్నాను' అని ప్రకటించాడు. ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు అలా చెప్పడమే...
Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి ఉన్న క్రేజ్ తెలిసిందే. అతడికి సోషల్‌మీడియాలోనూ మస్త్ మంది ఫాలోవర్లు ఉన్నారు. మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ(PSG) క్లబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా మెస్సీ ‘నేను మళ్లీ బార్సిలోనా(Barcelona)కు వెళ్లడం లేదు. అమెరికా క్లబ్‌కు వెళ్తున్నాను’ అని ప్రకటించాడు. ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు అలా చెప్పడమే ఆలస్యం లక్షలాది మంది అతడిని అనుసరించారు. ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు మెస్సీ అభిమానులు పోటెత్తారు.
దాంతో, క్లబ్‌కు కొత్తగా 40 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతకు ముందు మియాబి క్లబ్‌ను 9 లక్షల మంది మాత్రమే ఫాలో అయ్యేవాళ్లు. మెస్సీ తాను మియామికి ఆడబోతున్నా అని చెప్పగానే ఈ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 51 లక్షలకు చేరింది. ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్(David Beckham) మియామి క్లబ్ సహ- యజమానిగా ఉన్నాడు.

మెస్సీ తప్పుకోవడంతో..
ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఒకడైన మెస్సీ గత వారమే పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్‌కు గుడ్ బై చెప్పాడు. పీఎస్జీతో రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియమే అందుకు కారణం. దాంతో, అతడు వచ్చే సీజన్లో సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal) క్లబ్‌తో లేదంటే తిరిగి బార్సిలోనా(Barcelona)కు ఆడతాడనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ, అతడు మాత్రం కొత్త క్లబ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకని అమెరికాకు చెందిన మియామి క్లబ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు(6.9 కోట్లు). ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్ల(6.8కోట్లు)కి చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

