Mathew Renshaw | పునరాగమనం అదరలే.. 8 పరుగులకే ఔటైన ఆసీస్ ఓపెనర్..!
Mathew Renshaw : మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాథ్యూ రెన్షా(Mathew Renshaw) అంచనాలు అందుకోలేకపోయాడు. భారీ స్కోర్‌తో పునరాగమనం చాటుకోవాలనుకున్న అతడి ఆశలపై బంగ్లాదేశ్ పేసర్ నీళ్లు చల్లాడు.
Mathew Renshaw : మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాథ్యూ రెన్షా (Mathew Renshaw) అంచనాలు అందుకోలేకపోయాడు. భారీ స్కోర్‌తో పునరాగమనం చాటుకోవాలనుకున్న అతడి ఆశలపై బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ నీళ్లు చల్లాడు. మెక్కే టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభించిన రెన్షా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో.. మళ్లీ కంగారూ జట్టుకు ఓపెనింగ్ కష్టాలు మొదలయ్యాయి.
ఓపెనర్‌గా విఫలమవుతున్న జేక్ వెథెరాల్డ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మాథ్యూ రెన్షా నిరాశపరిచాడు. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 8 పరుగులకే వికెట్ ఇచ్చేశాడు. మెక్కే టెస్టులో మిచెల్ స్టార్క్(6-12) విజృంభణతో 64కే బంగ్లాదేశ్‌ను పడగొట్టిన ఆసీస్‌కు రెన్షా శుభారంభం ఇవ్వలేకపోయాడు. ఒక బౌండరీతో టచ్‌లో ఉన్నట్టే కనిపించిన అతడు.. తస్కిన్ అహ్మద్ ఓవర్లో ఔటయ్యాడు. దాంతో, 22 పరుగల వద్ద ఆసీస్ మొదటి వికెట్ పడింది.
8 on Test return for Matt Renshaw pic.twitter.com/SikOYz3O4x
— Cricinfo (@cricinfo) August 22, 2026
దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీడ్కోలు అనంతరం.. ఆసీస్ సెలెక్టర్లు పలువురిని పరీక్షించారు. ఉస్మాన్ ఖవాజా జతగా.. హెడ్, స్మిత్, నాతన్ మెక్‌స్వీనే, సామ్ కొన్స్టాన్స్, లబూషేన్లను ఆడించారు. ఈమధ్యే ఖవాజా రిటైర్మెంట్తో.. హెడ్ ఓపెనర్‌గా స్థిరపడగా అతడికి సరైన జోడీ మాత్రం దొరకలేదు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ఓపెనర్‌గా ఎంపికైన రెన్షా కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. బంగ్లాదేశ్ 64కే ఆలౌటైనందు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడొందలపైన కొడితే రెన్షాకు మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు.
A wicket first-ball from Mitchell Starc set the tone for Australia’s domination https://t.co/er1eeItXeu #AUSvBAN pic.twitter.com/al3f8xjn8R
— Cricinfo (@cricinfo) August 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

