టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును బద్ధలుకొట్టిన మార్టిన్ గప్టిల్

డ్యునెడిన్: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును తిరగరాశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గప్టిల్ కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ 8 సిక్సర్ల ద్వారా అతడు టీ20ల్లో ప్రపంచంలోనే అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గప్టిల్ ఇప్పటి వరకు 96 టీ20లు ఆడి 132 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు రోహిత్ శర్మ (127 సిక్స్‌లు, 108 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. ఈ ఇద్దరి తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (97 మ్యాచ్‌లలో 113 సిక్స్‌లు), న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మన్రో (107), విండీస్ వీరుడు క్రిస్ గేల్ (105) ఉన్నారు. అయితే గేల్ కేవలం 58 మ్యాచ్‌లలోనే ఇన్ని సిక్సర్లు బాదడం విశేషం.
గప్టిల్ జోరుతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 పరుగులతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. గప్టిల్ మెరుపు ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విజయానికి చేరువగా వచ్చినా.. 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 లీడ్‌లో ఉంది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. నీషమ్ వేసిన ఆ ఓవర్లో ఆస్ట్రేలియా 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో నీషమ్ రెండు వికెట్లు తీయడం విశేషం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టాయినిస్ 37 బంతుల్లోనే 78 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

