గోయెంకా, రాహుల్ అలయ్ బలయ్!
లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఒక మెట్టు దిగాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన నేపథ్యంలో స్నేహపూర్వకంగా భేటి అయ్యాడు.
న్యూఢిల్లీ: లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఒక మెట్టు దిగాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన నేపథ్యంలో స్నేహపూర్వకంగా భేటి అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు సోమవారం గోయెంకా తన నివాసంలో రాహుల్‌ను ప్రత్యేక విందుకు ఆహ్వానించాడు. రాహుల్‌కు స్వాగతం పలుకుతూ ఆత్మీయంగా కౌగిలించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి తోడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షాయ్ హోప్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ రాహుల్ పట్టిన క్యాచ్‌ను గోయెంకా లేచి నిలబడి చప్పట్లతో అభినందించాడు. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గత మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత విచక్షణ కోల్పోయిన గోయెంకా..అందరూ చూస్తుండగానే రాహుల్‌ను కడిగిపడేశాడు. దీనిపై అటు క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫ్రాంచైజీ యజమాని అయినంతా మాత్రాన ఒక ప్లేయర్‌తో పబ్లిక్ వ్యవహరించే తీరు ఇదేనా అంటూ సోషల్‌మీడియాలో గోయెంకాపై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

