IPL 2023 | లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ్ షో.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ చిత్తు
IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ డబుల్ హెడర్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పేసర్ పేసర్ మార్క్ వుడ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ కీలక వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు.
IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ డబుల్ హెడర్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను 50 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్ కైలీ మేయర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆ జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. ఆ తర్వాత పేసర్ పేసర్ మార్క్ వుడ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ కీలక వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 193 రన్స్ చేసింది. ఓపెనర్ మేయర్స్ అర్ధ శతకంతో మెరిశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను లక్నో బౌలర్ మార్క్ వుడ్ హడలెత్తించాడు. అతని ధాటికి ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బిష్ణోయ్, అవేశ్ ఖాన్ తలా రెండేసి వికెట్లు తీశారు.
వార్నర్ పోరాడినా..
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. మార్క్ వుడ్ తన తొలి ఓవర్లోనే పృథ్వీ షా(12), మిచెల్ మార్ష్(0)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్(4)ను ఐట్ చేసి మూడో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రమాదకరమైన రిలే రస్సో(), పావెల్(1)ను బిష్ణోయ్ పెవిలియన్ పంపాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56) ఒంటరి పోరాటం చేశాడు. అర్ధ శతకం బాదిన అతడికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. అతను ఔటయ్యాక ఆ జట్టు ఓటమి ఖాయమైంది. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడడంతో పరుగుల అంతరం తగ్గింది.
మేయర్స్ విధ్వంసం
ఐపీఎల్ డబుల్ హెడర్‌లో లక్నోలక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. 6 వికెట్ల నష్టానికి 193 రన్స్ కొట్టింది. ఓపెనర్ కైలీ మయర్ (73) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీపక్ హుడా (17)తో రెండో వికెట్‌కు 79 రన్స్ జోడించాడు. మార్కస్ స్టోయినిస్ (12) తొందరగానే వెనుదిరిగాడు. దాంతో, లక్నో 150 ప్లస్ స్కోర్ చేయడం కష్టమనిపించింది. ఆ తర్వాత నికోలస్ పూరన్(36), బదొని(18) సిక్స్‌లతో చెలరేగారు. చేతన్ సకారియా వేసిన ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లతో లక్నో బ్యాటర్లు 22 పరుగులు రాబట్టారు. ఢీల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

