Litton Das | అఫ్గనిస్థాన్‌తో వన్డే సిరీస్.. బంగ్లా కొత్త సారథిగా లిట్టన్ దాస్
Litton Das : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్‌గా లిట్టన్ దాస్(Litton Das) బాధ్యతలు చేపట్టాడు. మిగతా రెండు వన్డేలకు అతనే సారథ్యం వహించనున్నాడు. తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) వీడ్కోలు పలకడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న లిట్టన్కే పగ్గాలు అప్పగించాలని బంగ్లా క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) భావించింది. టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న లిట్టన్ ఈ మధ్యే చారిత్రాత్మక విజయం అందించాడు. అఫ్గనిస్థాన్‌తో జరిగిన...
Litton Das : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్‌గా లిట్టన్ దాస్(Litton Das) బాధ్యతలు చేపట్టాడు. మిగతా రెండు వన్డేలకు అతనే సారథ్యం వహించనున్నాడు. తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) వీడ్కోలు పలకడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న లిట్టన్కే పగ్గాలు అప్పగించాలని బంగ్లా క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) భావించింది. టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న లిట్టన్ ఈ మధ్యే చారిత్రాత్మక విజయం అందించాడు. అఫ్గనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లా 546 పరుగుల తేడాతో గెలుపొందింది.
అయితే.. రషీద్ ఖాన్(Rashid Khan) రాకతో పుంజుకున్న అఫ్గనిస్థాన్ తొలి వన్డేలో బంగ్లాకు షాకిచ్చింది. 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. కీలకమైన రెండో వన్డే జూలై 8న జరగనుంది. వన్డే కెప్టెన్(ODI Captain)గా ఉన్న తమీమ్ ఇక్బాల్ నిన్న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాడు.
తమీమ్ ఇక్బాల్

‘ఆటకు అల్విదా పలకాలనేది అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం కాదు. కుటుంబసభ్యులతో ఈ విషయమై చర్చించాను. నాన్న కలను నిజం చేసేందుకు బ్యాట్ పట్టాను. ఇన్నేళ్ల కెరీర్లో జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాను’ అని మీడియా సమావేశంలో తమీమ్ కన్నీటిపర్యంతమయ్యాడు. మరో మూడు నెలల్లో వన్డే ప్రపంచకప్(ODI WC 2023) ఉందనగా ఈ విధ్వంసక ఓపెనర్ ఆట నుంచి తప్పుకోవడం బంగ్లాకు పెద్ద షాకే.
నెదర్లాండ్స్.. ఆఖరి బెర్త్
ఈసారి 10 జట్లు వరల్డ్ కప్‌కి అర్హత సాధించాయి. స్కాట్లాండ్పై బంపర్ విక్టరీతో నెదర్లాండ్స్(Netherlands) జట్టు ఆఖరి బెర్త్ దక్కించుకుంది. ఈ ఏడాది వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న జరిగే ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Jhulan Goswami | షూ లేస్ కట్టుకోవడం కష్టమనిపించేది.. గాయాలతో వేగలేక వీడ్కోలు పలికాను : గోస్వామి
Serena Williams | ఫెదరర్‌పై సెరీనా విలియమ్స్ షాకింగ్ కామెంట్స్.. అంత సినిమా లేదన్న ఆమె సహచరుడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

