పారిస్: అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఐరోపా దిగ్గజ క్లబ్ పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మైన్)తో మరో ఏడాది పాటు ఒప్పందాన్ని కొనసాగించనున్నట్టు సమాచారం.
ఫ్రెంచ్ దినపత్రిక లి పారిసీయన్ గురువారం ఈ మేరకు ఒక వార్తను ప్రచురిస్తూ 35 ఏండ్ల మెస్సీ 2023-24 సీజన్‌కు పీఎస్జీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచురించింది. అయితే ఈ వార్తపై క్లబ్ నుంచి ఇంకా స్పందన రాలేదు. ఈ ఏడాది పీఎస్జీ తరఫున మెస్సీ 12 గోల్స్ చేశాడు.