Lionel Messi: బార్సిలోనాకు గుడ్‌బై.. దుఃఖం ఆపుకోలేకపోయిన మెస్సీ.. వీడియో
స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi ). ఆదివారం ఫేర్వెల్ సందర్భంగా మాట్లాడిన అతడు.. ఎంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు.

బార్సిలోనా: స్పానిష్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ( Lionel Messi ). ఆదివారం ఫేర్వెల్ సందర్భంగా మాట్లాడిన అతడు.. ఎంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులో 2000వ ఏడాదిలో బార్సిలోనాతో మెస్సీ ప్రయాణం మొదలైంది. అయితే ఇలా తన క్లబ్‌ను వీడుతానని ఎన్నడూ ఊహించలేదంటూ మెస్సీ ఏడ్చేశాడు.
బార్సిలోనాతోనే ఉందామని నిర్ణయించుకున్నాను. ఇది నా ఇల్లు. మన ఇల్లు. బార్కాతోనే కొనసాగాలన్నది నా ప్లాన్. నా జీవితం మొత్తం ఇక్కడే గడిపిన తర్వాత ఇవాళ గుడ్‌బై చెబుతున్నాను అని మెస్సీ తన ఫేర్వెల్ స్పీచ్‌లో అన్నాడు. క్లబ్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మెస్సీతో కాంట్రాక్ట్‌ను కొనసాగించడం లేదని గురువారం బార్సిలోనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడోసారి తిరిగి వస్తాననే అనుకున్నానని, అయితే ఇలా గుడ్‌బై చెబుతానని అనుకోలేదని మెస్సీ అన్నాడు.
ఎప్పుడూ బార్కాను వదిలి వెళ్తానని అనుకోలేదు. ఈ మహమ్మారి సమయంలో అభిమానులు లేకుండా ఆడుతున్న వేళ ఇది వింతగా ఉంది. ఎప్పుడో ఒకసారి మళ్లీ తిరిగి వస్తాను. క్లబ్లో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడీ స్థాయిలో ఉండటానికి కారణం ఇదే అని మెస్సీ అన్నాడు.
This is the word of Leo #Messi: pic.twitter.com/k0btQ7k1py
— FC Barcelona (@FCBarcelona) August 8, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

