Brian Lara | ఉమ్రాన్‌ను సానబెడితే.. మేలిమి వజ్రమవుతాడు : లారా
Brian Lara: భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik)పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara) ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు తరఫున ఆకట్టుకొని భారత జట్టులో చోటు దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని లారా పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో...
Brian Lara: భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik)పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara) ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు తరఫున ఆకట్టుకొని భారత జట్టులో చోటు దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని లారా పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ జట్టుకు లారా హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వేగంతోనే ప్రపంచ స్థాయి బ్యాటర్లను బోల్తా కొట్టించలేమని.. ఆ విషయం ఉమ్రాన్ ఎంత త్వరగా నేర్చుకుంటే అతడికి అంత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని లారా పేర్కొన్నాడు.
‘కేవలం బంతి వేగంగా వేస్తే సరిపోదు. ప్రపంచంలో బెస్ట్ ప్లేయర్లు ఎవరూ వేగంతో ఇబ్బంది పడలేదు. ఈ విషయం ఉమ్రాన్ ఎంత త్వరగా నేర్చుకుంటే అతత మంచింది. ఉమ్రాన్‌లో టాలెంట్‌కు కొదవ లేదు. సరైన దిశానిర్దేశం చేస్తే అతడు అద్భుతాలు సృష్టించగలడు. కేవలం వేగంగా బౌలింగ్ చేస్తే సరిపోదు. దాంతో పాటు అదనంగా ఏదైనా చేయగలగాలి అప్పుడే వికెట్లు దక్కుతాయి. మ్యాచ్ పరిస్థితిని అంచన వేస్తూ.. జట్టుకు ఏం కావాలో తెలుసుకొని బౌలింగ్‌లో వేరియేషన్స్ కనబర్చినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి’ అని లారా అన్నాడు.
స్టెయిన్‌తో శిక్షణ ఇప్పిస్తే..
దక్షిణాప్రికా గ్రేట్ పేసర్ డెల్ స్టెయిన్( Dayl Steynn)తో ఉమ్రాన్‌కు శిక్షణ ఇప్పిస్తే.. భారత జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని లారా అభిప్రాయపడ్డాడు. గతంలో వసీం అక్రమ్, మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్ వంటి వాళ్లు ఆరంభంలో పేస్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించినా.. ఆ తర్వాతి కాలంలో వేరియేషన్స్ కనబర్చారని లారా గుర్తు చేసుకున్నాడు. వాళ్లలాగే సుదీర్ఘ కాలం కొనసాగ గల సత్తా ఉమ్రాన్‌లో ఉందని.. అతడికి సరైన మార్గనిర్దేశకత్వం అవసరమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఉమ్రాన్.. నిలకడగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

