Kylian Mbappe | మెస్సీకి బర్త్ డే విషెస్ చెప్పిన ఎంబాపే.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Kylian Mbappe : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) ఈరోజుతో 36వ పడిలోకి అడుగుపెట్టాడు. పుట్టిన రోజు సందర్బంగా ఈ లెజెండరీ ఆటగాడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబాపే(Kylian Mbappe) కూడా మెస్సీకి బర్త్ డే విషెస్ తెలిపాడు. మెస్సీతో తన రెండేళ్ల పీఎస్జీ(Paris Saint-Germain) క్లబ్ అనుబంధాన్ని....
Kylian Mbappe : అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) ఈరోజుతో 36వ పడిలోకి అడుగుపెట్టాడు. పుట్టిన రోజు సందర్బంగా ఈ లెజెండరీ ఆటగాడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబాపే(Kylian Mbappe) కూడా మెస్సీకి బర్త్ డే విషెస్ తెలిపాడు. మెస్సీతో తన రెండేళ్ల పీఎస్జీ(Paris Saint-Germain) క్లబ్ అనుబంధాన్ని వివరిస్తూ పోస్ట్ పెట్టాడు.
‘హ్యాపీ బర్త్ డే లెజెండ్. పారిస్ క్లబ్‌తో రెండేళ్లు కొనసాగినందుకు థాంక్యూ. ఈ కాలంలో ఒక ఆటగాడిగా, భాగస్వామిగా, ప్రత్యర్థిగా, మనిషిగా నేను నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అందుకని నేను నీకు కృతజ్ఞుడిని. నీ కొత్త ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని ఎంబాపే ఆ పోస్ట్‌లో రాశాడు. అతడి ఇన్‌స్టా పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
పీఎస్జీకి కలిసి ఆడుతున్న సమయంలోనే.. మెస్సీ, ఎంబాపే 2022 వరల్డ్ కప్(FIFA World Cup) ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన టైటిల్ పోరులో మెస్సీ జట్టు పై చేయి సాధించింది. షూటౌట్లో 4-2తో గెలిచిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. అత్యధిక గోల్స్ కొట్టిన ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డు అందుకున్నాడు.
గోల్డెన్ బూట్‌తో ఎంబాపే, వరల్డ్ కప్ ట్రోఫీతో మెస్సీ

కాంట్రాక్ట్ ముగియడంతో..
జూన్ 30వ తేదీన పీఎస్జీ క్లబ్ తరఫున మెస్సీ ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియడంతో పీఎస్జీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, వచ్చే సీజన్లో అతను ఏ క్లబ్‌కు ఆడతాడు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా(Barcelona), సౌదీ అరేబియా క్లబ్ అల్ – హిలాల్(Al Hilal ) క్లబ్స్ ఈ దిగ్గజ ఆటగాడితో ఒప్పందం కోసం ప్రయత్నించాయి. కానీ, మెస్సీ మాత్రం మియామి క్లబ్‌కు ఓకే చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

