IPL 2023 : పవర్ ప్లేలో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(10), ప్రేరక్ మన్కడ్(16) క్రీజులో ఉన్నారు. ఫజల్హక్ ఫారుఖీ వేసిన 6వ ఓవర్లో మన్కడ్ రెండు బౌండరీలు కొట్టాడు. దాంతో, లక్నో పవర్ ప్లేలో 30 రన్స్ చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు నిదానంగా ఆడారు. భువనేశ్వర్, ఫారుఖీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. కైల్ మేయర్స్(2) మూడో ఓవర్లో తొలి బౌండరీ కొట్టాడు. అయితే.. స్పిన్ బౌలింగ్లో మరక్రం చేతికి చిక్కాడు. దాంతో, 12 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ పడింది.