INDvsSA Tests: సఫారీలతో టెస్టు సిరీస్‌లో వికెట్ కీపర్ అతడే.. కన్ఫమ్ చేసిన హెడ్‌కోచ్
INDvsSA Tests: సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీమిండియా.. ఫైనల్ లెవన్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే....
INDvsSA Tests: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్.. మంగళవారం (డిసెంబర్ 26) నుంచి సఫారీలతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించనుంది. సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీమిండియా.. ఫైనల్ లెవన్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే స్పెషలిస్టు వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్ ఉన్నా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్‌కే ఆ బాధ్యతలను అప్పజెప్పుతోంది. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు.
తొలి టెస్టు ఆరంభానికి ముందు నిర్వహించిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో కెఎల్ రాహులే వికెట్ కీపర్‌గా ఉంటాడని అన్నాడు. గతంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వికెట్ కీపర్‌గా ఉన్న రాహుల్, టెస్టులలో ఈ బాధ్యతలు తీసుకుంటుండటం ఇదే ప్రథమం. టెస్టు సిరీస్‌కు ముందే ఈ విషయాన్ని తాము రాహుల్‌తో చర్చించామని, అందుకు అతడు కూడా అంగీకరించాడని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.
Rahul Dravid “KL Rahul is confident to keep wickets in Test cricket”. [Star Sports] pic.twitter.com/emDFioAc6a
— Johns. (@CricCrazyJohns) December 24, 2023
కాగా భారత క్రికెట్ జట్టుకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇదే తొలి టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్‌తోనే టీమిండియా తర్వాతి డబ్ల్యూటీసీ సైకిల్ (2023-2025)కి సన్నద్ధమవనుంది. ఇన్నాళ్లూ టెస్టులలో కీలక పాత్ర పోషించిన ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి ఆటగాళ్లు లేకుండానే భారత్ బరిలోకి దిగబోతోంది. రోహిత్, కోహ్లీలు ఉన్నా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

