విలియమ్సన్కు గాయం

- ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరం
బర్మింగ్‌హామ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో గురువారం నుంచి మొదలయ్యే మ్యాచ్‌కు విలియమ్సన్ స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్‌తో కీలకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌కు ముందు విలియమ్సన్ గాయం తీవ్రత ఎక్కువ కావద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ బుధవారం పేర్కొన్నాడు. ‘కొంత కాలంగా మోచేతి గాయం కేన్‌ను తీవ్రంగా వేధిస్తున్నది. మార్చి నుంచి అతను జట్టుకు దూరం కావడం ఇది తొలిసారి. టెస్టు మ్యాచ్ నుంచి విలియమ్సన్ తప్పుకోవడం సులువైన నిర్ణయం కాదు. కానీ టీమ్ఇండియాతో కీలక డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భారత్‌తో మ్యాచ్ నాటికి అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకముంది’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

