James Anderson | వరల్డ్ నంబర్ 1 టెస్టు బౌలర్‌గా అండర్సన్.. కెరీర్లో ఇది ఆరోసారి
ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వరల్డ్ నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా నిలిచాడు. నలభై ఏళ్ల వయసులో ఈ స్పీడ్‌స్టర్ ఐసీసీ నంబర్ 1 టెస్టు బౌలర్ అయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో అండర్సన్ ఏడు వికెట్లు పడగొట్టాడు.
James Anderson : ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వరల్డ్ నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా నిలిచాడు. లేటు వయసులోనూ తన బౌలింగ్ పస తగ్గలేదని చాటుతున్న ఈ లెజెండరీ బౌలర్ న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఏడు వికెట్లు పడగొట్టాడు. దాంతో, నలభై ఏళ్ల వయసులో ఈ స్పీడ్‌స్టర్ ఐసీసీ నంబర్ 1 టెస్టు బౌలర్ అయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం అందుకున్నాడు. నాలుగేళ్లుగా కమిన్స్ వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ఈ లెజెండరీ బౌలర్ వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సాధించడం ఇది ఆరోసారి. అయితే.. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు, అండర్స్న్కు రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది. దాంతో, ఆస్ట్రేలియాలతో మూడో టెస్టులో అశ్విన్ చెలరేగితే వరల్డ్ నంబర్ 1 బౌలర్ అయ్యే అవకాశం ఉంది.
2016లో తొలిసారి
నలభై ఏళ్లలో వరల్డ్ నంబర్ 1 అయిన రెండో బౌరల్గా అండర్సన్ గుర్తింపు సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమ్మెట్ 40 ఏళ్లకు 1936లో టాప్ ర్యాంక్ అందుకున్నాడు.అండర్సన్ 2016లో మొదటిసారరి వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. తన సహచరుడు స్టువార్ట్ బ్రాడ్‌ను దాటేసి అతను నంబర్ 1 ర్యాంకుకు ఎదగబాకాడు. ఆ తర్వాత అండర్సన్ 2018లో ఐదు నెలలు నంబర్ వన్ బౌలర్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అతడిని వెనక్కి నెట్టి అగ్రస్ధానానికి చేరాడు.
32 సార్లు 5 వికెట్లు
అండర్సన్ గత రెండు దశాబ్దాలకు పైగా ఇంగ్లండ్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. స్టువార్డ్ బ్రాడ్‌తో కలిసి వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్వింగ్‌తో బ్యాటర్లను బొల్తా కొట్టించే అండర్సన్ టెస్టు ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 682 టెస్టు వికెట్లు ఉన్నాయి. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), ఆస్ట్రేలియా దివంగత లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్ (708 వికెట్లు) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ లెజెండరీ బౌలర్ టెస్టుల్లో 32 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఇవి కూడా చదవండి
Womens T20 WC | మహిళల టీ20 వరల్డ్ కప్.. టీమిండియా సెమీస్ ఫైట్ ఈ జట్టుతోనే..!
Aakash Chopra | బుమ్రా ఐపీఎల్ ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదు : ఆకాశ్ చోప్రా
IPL | ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్.. బెస్ట్ బౌలర్, ఉత్తమ బ్యాటర్ ఎవరంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

