భారత్-విండీస్ టీ20కి కొత్త పిచ్
రెండేండ్ల విరామం తర్వాత హైదరాబాద్‌కు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిరిగిస్తోంది. ఈ నెల 14న ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
- 15 ఏండ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వికెట్లను మార్చిన హెచ్‌సీఏ
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రెండేండ్ల విరామం తర్వాత హైదరాబాద్‌కు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిరిగిస్తోంది. ఈ నెల 14న ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రధాన స్టేడియంలో కొత్త పిచ్‌లను ఏర్పాటు చేసినట్టు హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు.
15 ఏండ్ల విరామం తర్వాత స్టేడియంలోని ఆరు పిచ్‌ల ఔటర్ లేయర్లను సరికొత్తగా మార్చినట్టు వెల్లడించారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోజరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ ప్రతినిధి శేష్ నారాయణ, సీఈఓ ఇంతియాజ్ ఖాన్‌తో కలిసి ఏర్పాట్లను వివరించారు. ఈ మ్యాచ్ కోసం రూ. 750 నుంచి రూ. 20 వేల ధరల వరకు ఉన్న 34 వేల టికెట్లను ‘టికెట్జీనీ’ యాప్‌లో విక్రయానికి ఉంచామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో 24 వేల టికెట్లు అమ్మకానికి పెట్టామని.. మిగిలిన పాసులను మ్యాచ్‌కు 48 గంటల ముందు అందుబాటులో ఉంచుతామన్నారు.
పాఠశాల విద్యార్థులకు 2500 ఉచిత టికెట్లు
పాఠశాల విద్యార్థుల కోసం 2500, ఆర్మీ సిబ్బందికి 250 టికెట్లను ఉచితంగా అందజేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. వీటి కోసం ఆయా పాఠశాలల యాజమాన్యాలు హెచ్‌సీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత భోజనం కూడా కల్పిస్తామన్నారు. వారి రవాణా, ప్రయాణ బాధ్యతలను యాజమాన్యాలే చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

