INDvsAFG T20I: అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్.. భారత్ గెలిస్తే టీ20 క్రికెట్లో చరిత్రే..!
INDvsAFG T20I: పొట్టి క్రికెట్లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్.. నేడు అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కూడా మరో అరుదైన ఘనతను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గనక భారత్ గెలిస్తే రోహిత్..
INDvsAFG T20I: సుమారు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. అఫ్గానిస్తాన్‌తో మరికొద్దిసేపట్లో మొహాలీ (పంజాబ్) వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20కి సిద్ధమవుతున్నాడు. హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లకు గాయాలతో పాటు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టీమ్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్.. నేడు అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కూడా మరో అరుదైన ఘనతను అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గనక భారత్ గెలిస్తే రోహిత్.. అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టు తరఫున వంద మ్యాచ్‌లలో గెలిచిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు.
36 ఏండ్ల రోహిత్.. భారత్ తరఫున ఇప్పటివరకూ 99 మ్యాచ్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. నేటి మ్యాచ్‌లోనూ గెలిస్తే రోహిత్ వంద మ్యాచ్‌లలో సభ్యుడిగా ఉన్న ప్లేయర్ అవుతాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇన్ని మ్యాచ్‌లలో గెలిచిన సందర్భాలు లేవు. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షోయభ్ మాలిక్.. 86 మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 73 విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌తో పాటు అఫ్గానిస్తాన్ మాజీ సారథి మహ్మద్ నబీలు 70 విజయాలలో భాగస్వాములుగా ఉన్నారు.
భారత్ తరఫున 99 విజయాలలో భాగస్వామిగా ఉన్న రోహిత్.. 99 మ్యాచ్‌లలో 3,039 పరుగులు చేశాడు. ఇందులో 25 అర్థ సెంచరీలూ ఉన్నాయి. ఈ క్రమంలో రోహిత్ సగటు 37.98 కాగా స్ట్రైక్ రేట్ 142.60గా ఉంది. అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకూ 148 మ్యాచ్‌లు ఆడి 140 ఇన్నింగ్స్‌లలో 3,853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 అర్థ సెంచరీలున్నాయి. అఫ్గాన్‌తో సిరీస్‌లో గనక రోహిత్ 147 పరుగులు చేస్తే టీ20లలో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో బ్యాటర్ అవుతాడు. పొట్టి క్రికెట్లో విరాట్ కోహ్లీ (4008) మాత్రమే ఈ మైలురాయిని దాటిన క్రికెటర్‌గా ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

