IND vs SL : సీనియర్ బౌలర్ షమి భారత్‌కు నాలుగో వికెట్ అందించాడు. హాఫ్ సెంచరీకి చెరువలో ఉన్న ధనంజయ డిసిల్వా(47)ను వెనక్కి పంపాడు. ధనంజయ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ అందుకోవడంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయిది. భారత బౌలర్లు విజృంభించి వరుసగా వికెట్లు తీస్తూ లంకను ఒత్తిడిలోకి నెడుతున్నారు. ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (56) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను తమ జట్టుకు భారీ ఓటమిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ కీలకమైన చరిత అసలంక (23) మూడో వికెట్‌గా పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం 28 ఓవర్లకు శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. నిస్సంకా 64, కెప్టెన్ దసున్ షనక 6 రన్స్‌తో ఆడుతున్నారు.