Christiano Ronaldo | అలా జరిగితే.. నేను రిటైర్ అవుతా : క్రిస్టియానో రొనాల్డో
మా జట్టు ఫిఫా వరల్డ్ కప్ గెలిస్తే నా అంత సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరు
ఫిఫా వరల్డ్ కప్ 2022 త్వరలోనే ఖతర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బ్రిటీష్ జర్నలిస్ట్ పియెర్స్ మోర్గాన్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పోర్చుగల్ స్టార్ ఆటగాడు రొనాల్డో సరదాగా మాట్లాడాడు. ‘పోర్చుగల్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా అవతరిస్తే నేను రిటైర్ అవుతాను’ అంటూ రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ పట్ల తనకున్న ఇష్టాన్ని తెలియజేశాడు.
రొనాల్డోని ఇంటర్వ్యూ చేసిన పియర్స్.. ‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో పోర్చుగల్, అర్జెంటీనా తలపడ్డాయి అనుకోండి. నువ్వు రెండు గోల్స్ చేశావు. మెస్సీ కూడా రెండు గోల్స్ కొట్టాడు. 94వ నిమిషంలో నువ్వు మూడో గోల్ చేసి జట్టుని గెలిపించావు. పొర్చుగల్ వరల్డ్‌కప్ అందుకుంది’ అని ఊహిస్తూ చెప్తాడు.
అతను చెప్పేది విన్నాక రొనాల్డో ‘అలా జరిగితే నా అంత సంతోషపడే వ్యక్తి మరొకరు ఉండరు. ఒకవేళ పోర్చుగల్ గోల్‌కీపర్ విన్నింగ్ గోల్ కొట్టి, మా జట్టు ప్రపంచ కప్ గెలిచినా నేను చాలా సంతోషిస్తా. అదే జరిగితే నేను ఫుట్‌బాల్‌కి గుడ్ బై చెప్తాను’ అంటాడు. అంతేకాదు మెస్సీ చాలా అద్భుతమైన ఆటగాడు. మేము 16 ఏళ్లుగా మైదానంలో ఆడుతున్నాం అని రొనాల్డో చెప్పాడు. రొనాల్డో 1992లో ఫుట్‌బాల్ కెరీర్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. 800లకు పైగా గోల్స్ చేశాడు. రొనాల్డో నాలుగు సార్లు గోల్డెన్ బూట్ అవార్డు అందుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

