హైదరాబాద్ చేజారిన ఆధిక్యం
పంజాబ్‌తో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ వైఫల్యంతో హైదరాబాద్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చేజార్చుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : పంజాబ్‌తో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ వైఫల్యంతో హైదరాబాద్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చేజార్చుకుంది. జింఖానా మైదానంలో బుధవారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 193/2 ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 119.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో పంజాబ్‌కు 51 పరుగుల ఆధిక్యం లభించింది. రాహుల్ రాదేష్ (86), కె. హిమతేజ (81), సాయి ప్రజ్ఞాయ్ రెడ్డి (65) అర్ధశతకాలతో పోరాడటంతో ఓ దశలో 343/4తో హైదరాబాద్ బలమైన స్థితిలో నిలిచింది.
కానీ, రెండో కొత్త బంతి వచ్చిన తర్వాత పంజాబ్ బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ (2), తనయ్ త్యాగరాజన్ (2), రుతిక్ (1) అనికేత్ రెడ్డి (1)ని పెవిలియన్ చేర్చారు. ఆఫ్ స్పిన్నర్ విహాన్ మల్హోత్రా (4/15) ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ఆట ముగిసే సమయానికి పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి ఓవరాల్‌గా 108 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

