హైదరాబాద్ 275 ఆలౌట్
ఆంధ్రతో రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్లో హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ఆదివారం మొదలైన గ్రూప్-బీ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సిరాజ్సేన తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకే ఆలౌటైంది.
విజయవాడ : ఆంధ్రతో రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్లో హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. ఆదివారం మొదలైన గ్రూప్-బీ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సిరాజ్సేన తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు అభిరథ్ రెడ్డి (67), తన్మయ్ అగర్వాల్ (42) తొలి వికెట్కు 109 పరుగులు జోడించి మంచి పునాది వేసినా ఈ జోడీ విడిపోయిన తర్వాత హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో రాహుల్ రాదేశ్ (58 నాటౌట్) మాత్రమే ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ 4, లలిత్ మోహన్, సౌరభ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆంధ్ర తొలి రోజు చివరకు వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.
గిల్ ఒక్క పరుగుకే ఔట్
న్యూజిలాండ్ పర్యటనకు ముందు పంజాబ్ జట్టు తరఫున రంజీ బరిలో నిలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (1) నిరాశ పరిచాడు. చత్తీస్గఢ్తో మొదలైన మ్యాచ్లో ఐదు బంతులాడి ఒకే పరుగు చేసిన అతను లెఫ్టార్మ్ స్పిన్నర్ అజయ్ మండల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. గిల్ ఫెయిలైనా ఉదయ్ సహరన్ (106 బ్యాటింగ్), ప్రభ్సిమ్రన్ సింగ్ (62) సత్తా చాటడంతో పంజాబ్ తొలి రోజు ఆటను 269/4తో ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

