Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Mahela Jayawardene | ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్ ఫ్రాంచైజీ (IPL franchise), ఆ ఫ్రాంచైజీ టీమ్ హెడ్ కోచ్ (Head Coach) మహేల జయవర్దనే (Mahela Jayawardene) మధ్య తొమ్మిదేళ్ల బంధానికి తెరపడింది. ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
Mahela Jayawardene : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్ ఫ్రాంచైజీ (IPL franchise), ఆ ఫ్రాంచైజీ టీమ్ హెడ్ కోచ్ (Head Coach) మహేల జయవర్దనే (Mahela Jayawardene) మధ్య తొమ్మిదేళ్ల బంధానికి తెరపడింది. ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనేతో బంధాన్ని ముగించుకుంది. ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాయి.
పోయిన ఐపీఎల్ సీజన్లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వచ్చే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతున్నది. గడిచిన ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ సీజన్లో జట్టు కేవలం నాలుగు గెలుపులతో సరిపెట్టుకుంది. ఆటగాళ్లు గాయాలపాలవడం, కొందరు అందుబాటులో లేకపోవడం, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నాయన్న వార్తలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు కథనాలు వెలువడ్డాయి.
కొత్త హెడ్ కోచ్ ఎంపిక కోసం ఫ్రాంచైజీ ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా ముంబైతో జయవర్ధనే ప్రయాణం 2017లో ప్రారంభమైంది. ఆయన కోచింగ్‌లో జట్టు 2017, 2019, 2020 సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. దాంతో ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా జయవర్ధనే గుర్తింపు పొందాడు. ముంబైతో తన అనుబంధం పదేళ్లకు పైగా కొనసాగిందని జయవర్ధనే చెప్పాడు.
ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులతో కలిసి ఎన్నో మధుర జ్ఞాపకాలు సృష్టించుకున్నామని తెలిపాడు. తనపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలకు కృతజ్ఞతలు చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఆయన అందించిన సేవలను నీతా అంబానీ కూడా ప్రశంసించారు. జయవర్ధనే ఎప్పటికీ తమ ‘వన్ ఫ్యామిలీ’ లో భాగమేనని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

