హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్యురేటర్స్, అంపైర్లు, స్కోరర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పేర్కొన్నారు. క్యురేటర్స్కు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు, వచ్చే నెల 3 నుంచి 4 వరకు స్కోరర్లకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
అంపైర్లకు జూన్ 1వ తేదీన ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనుండగా, ఇందులో హెచ్‌సీఏ రిజిష్టర్ అంపైర్లు, స్కోరర్లు, వీడియో అనలిస్టులు కూడా పాల్గొనవచ్చని తెలిపారు.