Kylian Mbappe: దూసుకొస్తున్న ఫ్రాన్స్ స్ట్రయికర్.. ఫ్లూట్ ఊదిన ఎంబాప్పే
Kylian Mbappe: ఫిఫా వరల్డ్‌కప్‌లో కైలియన్ ఎంబాప్పే దూసుకొస్తున్నాడు. సెనిగల్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతను.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వరల్డ్‌కప్ చరిత్రలో 14 గోల్స్ చేసి.. లీడింగ్ గోల్ స్కోరర్ దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఈస్ట్ రూథర్‌ఫోర్డ్: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ స్ట్రయికర్ కైలియన్ ఎంబాప్పే(Kylian Mbappe) తన ట్యాటెంట్ ప్రదర్శించాడు. సెనిగల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా అతను రికార్డు సృష్టించాడు. సెనిగల్‌తో మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌ల్లో ఎంబాప్పే తన ఖాతాలో 14 గోల్స్ వేసుకున్నాడు. కేవలం మూడో వరల్డ్‌కప్ ఆడుతున్న ఎంబాప్పే తన గోల్స్ స్కోరింగ్‌లో దూసుకొస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన ప్లేయర్లలో క్లోస్, మెస్సీ ఉన్నారు. ఆ ఇద్దరు ప్లేయర్లు వ్యక్తిగతంగా వరల్డ్‌కప్ టోర్నీల్లో 16 గోల్స్ చేశారు. దేశం కోసం చరిత్ర సృష్టిస్తానని, తమ జట్టు వరల్డ్‌కప్ గెలిచేందుకు ఆడుతానని ఎంబాప్పే అన్నాడు.
సెనిగల్‌తో మ్యాచ్‌లో ఎంబాప్పే 66వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. అయితే సెనిగల్ గోల్‌కీపర్ మెండీ ఆరంభంలో ధీటుగా ఫ్రాన్స్ స్ట్రయికర్లను అడ్డుకున్నాడు. తొలి గోల్ చేసిన తర్వాత కెప్టెన్ ఎంబాప్పే అరుదైన రీతిలో దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. గోల్ కొట్టిన తర్వాత ఫ్లూట్ ఊదాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎంబాప్పే ఫ్లూట్ వాయించాడు. ఆ సమయంలో మాట్లాడుతూ ఒకవేళ ఆఫ్రికాపై గోల్ కొడితే, అప్పుడు పిల్లనిగ్రోవిని వాయిస్తానని చెప్పాడు. దాని ప్రకారమే గోల్ కొట్టిన తర్వాత ఎంబాప్పే వేణువును ఊదుతున్నట్లుగా సంకేతం ఇచ్చాడు. ఇక మళ్లీ 96వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. ఇప్పటి వరకు ఎంబాప్పే వరల్డ్‌కప్ గోల్స్ సంఖ్య 14కు చేరుకున్నది. దీంతో ఆ దేశ ప్లేయర్ గెర్డ్ ముల్లర్ సరసన అతను చేరాడు. బ్రెజిల్ స్టార్ రోనాల్డో ఖాతాలో 15 వరల్డ్‌కప్ గోల్స్ ఉన్నాయి. 2018లో ఫ్రాన్స్ వరల్డ్‌కప్ గెలవడంలో ఎంబాప్పే కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022లోనూ ఆ జట్టు ఫైనల్ చేరేందుకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఫ్రాన్స్‌ను మరోసారి ముందుండి నడిపిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

