Ashes Series | ఇంగ్లండ్‌కు వరుస ఎదురుదెబ్బలు.. పింక్‌బాల్ టెస్టుకు దూరమైన ప్రధాన పేసర్..!
Ashes Series : యాషెస్ సిరీస్‌ను భారీ ఓటమితో ఆరంభించిన ఇంగ్లండ్ (England)కు మరో షాక్. ఐదు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడిన ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని కోల్పోనుంది.
Ashes Series : యాషెస్ సిరీస్‌ను భారీ ఓటమితో ఆరంభించిన ఇంగ్లండ్ (England)కు మరో షాక్. ఐదు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడిన ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) సేవల్ని కోల్పోనుంది. మ్యాచ్ విన్నర్ అయిన ఈ స్పీడ్‌స్టర్ అనూహ్యంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న వుడ్ బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగే డే – నైట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. దాంతో.. ఎలాగైనా సిరీస్ సమం చేయాలనుకున్న బెన్ స్టోక్స్ బృందానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఫిబ్రవరిలో చివరి టెస్టు ఆడిన వుడ్.. మోచేతి గాయం నుంచి కోలుకొని ఇటీవలే స్క్వాడ్‌లోకి వచ్చాడు. పదునైన స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌తో ఆసీస్ బ్యాటర్లను వుడ్ బోల్తా కొట్టిస్తాడని ఇంగ్లండ్ అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, పెర్త్ టెస్టులో ఈ సీనియర్ పేసర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 11 ఓవర్లే వేశాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ మెరుపులతో రెండో రోజే పెర్త్ టెస్టు ముగిసింది. దాంతో.. 104 ఏళ్ల చరిత్రలో యాషెస్ టెస్టు ఇంత త్వరగా పూర్తవ్వడం ఇదే మొదటిసారి.
Mark Wood is set to miss the second Test at Brisbane as England look to preserve their prized fast bowler for the remainder of the Ashes
Full story: https://t.co/xdgaEZFbZx pic.twitter.com/fMe8kmWPUY
— ESPNcricinfo (@ESPNcricinfo) November 29, 2025
బ్రిస్బేన్ టెస్టుకు మార్క్ వుడ్ అందుబాటులో లేకపోవడంతో.. అతడి స్థానంలో యువ పేసర్ జోష్ టంగ్(Josh Tongue)ను తీసుకునే అవకాశముంది. డిసెంబర్ 4న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బాలో పింక్ బాల్ టెస్టు డే-నైట్‌లో జరుగనుంది. మరోవైపు.. ఆతిథ్య జట్టు కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ హేజిల్‌వుడ్‌లు రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

