వింబుల్డన్‌లో కజకస్తాన్ క్రీడాకారిని రైబాకినా చరిత్ర సృష్టించింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తొలి కజకిస్తాన్ క్రీడాకారిణిగా నిలిచింది. ప్రపంచ నెంబర్ 23వ ర్యాంకర్ అయిన ఎలెనా రైబాకినా.. మహిళల సింగిల్స్ టైటిల్ దక్కించుకుంది. 23 ఏళ్ల రైబాకినా.. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్స్ జబేర్‌పై విజయం సాధించింది.
ట్యునీషియాకు చెందిన జబేర్‌తో జరిగిన మ్యాచ్‌లో రైబాకినా 3-6, 6-2, 6-2 తేడాతో విజయం సాధించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. వీళ్లిద్దరూ కూడా తమ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో పోటీ పడ్డారు. అయితే విజయం మాత్రం రైబాకినానే వరించింది.