NZ vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టెస్టులో ఇంగ్లండ్ ధీటుగా ఆడుతోంది. బజ్‌బాల్ ఆటతో అలరించిన ఓపెనర్ బెన్ డకెట్(113) శతకంతో రెచ్చిపోగా.. జాకబ్ బెథెల్(63 నాటౌట్) అర్ధ శతకంతో కదం తొక్కాడు. వీరిద్దరి విధ్వంసంతో న్యూజిలాండ్ బౌలర్లు నీరుగారిపోగా.. ఆతిథ్య జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. సొంతమైదానంలో డకెట్ సెంచరీకి.. బెథెల్ మెరుపులు తోడవ్వగా.. 33 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 188 రన్స్ కొట్టింది ఇంగ్లండ్. చేతిలో ఎనిమిది వికెట్లు ఉండడంతో మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపిస్తోంది బెన్ స్టోక్స్ సేన.
నాటింగ్హమ్ టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. తొలిరోజు న్యూజిలాండ్ బ్యాటర్ల ధాటికి డస్సిపోయిన బౌలర్లు రెండోరోజు రాణించారు. అలవోకగా ఐదొందలు కొట్టేలా కనిపించిన కివీస్ అనూహ్యంగా 438కే ఆలౌటవ్వగా.. ఓపెనర్ బెన్ డకెట్(113) తన స్టయిల్ విధ్వంసంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డును ఉరికించాడు.
Jacob Bethell’s scores in England’s first innings of a Test:
10, 16, 12, 6, 1, 10, 6, 9, 𝟱𝟬*
Finally, a first-innings fifty! 👏 #ENGvNZ pic.twitter.com/UZGmlceAX8
— Cricinfo (@cricinfo) June 26, 2026
మరో ఓపెనర్ ఎమిలియో గే(0) డకౌటైనా.. జాకబ్ బెథెల్(63 నాటౌట్) జతగా కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన డకెట్ బజ్ బాల్ ఆటను రూచి చూపించాడు. మెరుపు వేగంతో ఆడిన అతడు సెంచరీతో .. బెథెల్ అర్ధ శతకంతో రాణించగా ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. మరో 24 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో స్టోక్స్ సేన మూడొందలు కొట్టడం ఖాయమనిపిస్తోంది.